#బూడిద గుమ్మడి-Ash Gaurd ఓం #ధన్వంతరే నమః బూడిదగుమ్మడిని చాలా రకాలుగా వాడతాము. విరివిగా లభించే ఈ గుమ్మడిలో ఎన్నో ఓషధ గుణాలు ఉన్నాయి. బూడిద గుమ్మడి ని, రసం,కల్కమ్, వంటల్లో, తీపిగా పేఠ మాదిరిగా వాడుతుంటాము. బూడిదగుమ్మడి పైన పరిశోధనల వలన ఇంకా మరిన్ని సుగుణాలు వెలుగులోకి వస్తున్నాయి. నీటి శాతం అధికంగా ఉండి, విటమిన్ C, జింక్, మేగ్నేషియం, ఐరన్ వంటి మినరల్స్ కొంత వరకు ఉండి మూత్రవ్యవస్థకి మేలును చేస్తుంది. అదేవిధంగా ఫైబర్ కలిగి ఉండటం వల్ల జీర్ణవ్యవస్థకు మేలుచేస్తుంది. * ఆయుర్వేదంలో కుశ్మండకి, బృహత్ఫలి అంటాము, అనేక ఔషధతయారీలో, అవలెహంగానూ వాడుతాము. *శరీరంలో వేడి, కాక ఎక్కువగా ఉన్నవారికి, మూత్రములో సమస్య ఉన్నవారిలో చాలా ఫలితాన్నిస్తుంది. * బూడిదగుమ్మడి రసం(జ్యూస్)తాగడం వలన జ్వరం, రక్తహీనత, మూత్రంలో మంట, కడుపులో వేడి సమస్యను తగ్గుతుంది. * లేతగా ఉన్న గుమ్మడి రసం(జ్యూస్) వలన పైత్యం, మూత్రములో రాళ్లు, క్రిమిరోగం, అతిమూత్రం వంటి సమస్యలు తగ్గుతాయి. * బరువు తగ్గాలనుకునే వాళ్ళు బూడిదగుమ్మడి ని తీసుకోవడం వలన పొట్ట నిండుగా ఉండి, ఎక్కువ తినాలనే కోరిక లేకుండా ఫలితం చూపిస్తుంది. * శరీరంలో in...
వాము -Ajwain, carum seeds:
వంటింట్లో తప్పనిసరిగా ఉండే ఈ సుగంధద్రవ్యం చక్కటి ఔషధం. చిన్నపిల్లల మొదలు వృధ్దాప్యం వరకు అందరికి మేలు చేసే వాము గురించి మరిన్ని వివరాలు..
కారం, వగరు రుచి, ఉష్ణవీర్యం కలిగి ఉంటుంది.
వాము చెట్టు యొక్క ఫలాలు "వాముగింజలు". చూర్ణంగా, కషాయంగా, నేరుగా వాడటం జరుగుతుంది.
వాము లో ఉండే రసాయనాలు, ఆయిల్స్, విటమిన్స్, మినరల్స్, యాంటియోక్సిడెంట్స్ గాను, శరీరసమస్యలకు మందులా పనిచేస్తాయి.
* జీర్ణక్రియ:జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యల్లో కడుపుబ్బరం, అధికవాయువు, అజీర్ణం, ఆకలి లేకపోవడం, పొట్ట బరువుగా అనిపించడం వంటి సమస్యల్లో త్వరగా ఉపశమనం ఇస్తుంది.
* శరీర బరువు తగ్గించడంలో, అధిక కొలెస్ట్రాల్ తగ్గించడంలో చక్కగా ఉపయోగపడుతుంది.
*blood ప్రెషర్ ఎక్కువగా ఉన్నవారిలో లెవెల్ సాధారణస్థాయికి తేవడంతో పాటు, గుండెకి సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి.
* అంతేకాకుండా AntiInflammatory లక్షణం వలన పొట్టలోని సమస్యలు, మూత్రమార్గ ఇన్ఫెక్షన్ లు, ఉబ్బసం వంటి సమస్యల్లో బాగా ఉపశమనం ఇస్తుంది.
* అలాగే వీర్యవృద్ధి, ఋతుక్రమం సరిచేస్తుంది.
> వాము వేడి నీటిలో వేసిగాని, పొగ వలె గాని వాడినా జలుబు, ఉబ్బసంలో ఉపశమనం ఇస్తుంది.
>వాము +లవంగం వేయించి కాషాయం మాదిరి చేసి కొద్దికొద్దిగా సరైన మోతాదులో తాగితే కడుపుబ్బరం, అజీర్ణం పోయి, ఆకలిని పెంచుతుంది.
> వాము ఆకు వెచ్చచేసి చిన్న పిల్లల ఛాతీపై కొద్దిసమయం వరకుకాపాడం పెట్టినా జలుబులో ఉపశమనం ఉంటుంది.
ఏదిఏమైనా వాము ఉష్ణగుణం అంటే వేడిచేసి వాతకఫము ని తగ్గిస్తుంది.
తీసుకునే మోతాదు, సమస్య, కాలం అనేవి ప్రతివ్యక్తికి వేరుగా ఉంటుంది.
అందుకే ఏదైనా సమస్యకు ఔషధప్రయోగానికి ముందు ఆయుర్వేద వైద్యనిపుణుల సలహా తీసుకుంటే ఉత్తమం.
Dr.K.V.మాలతి BAMS
శ్రీ చతుర్వేద ఆయుర్వేదాలయం
శంషాబాద్.



కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి