#బూడిద గుమ్మడి-Ash Gaurd
ఓం #ధన్వంతరే నమః
బూడిదగుమ్మడిని చాలా రకాలుగా వాడతాము. విరివిగా లభించే ఈ గుమ్మడిలో ఎన్నో ఓషధ గుణాలు ఉన్నాయి.
బూడిద గుమ్మడి ని, రసం,కల్కమ్, వంటల్లో, తీపిగా పేఠ మాదిరిగా వాడుతుంటాము.
బూడిదగుమ్మడి పైన పరిశోధనల వలన ఇంకా మరిన్ని సుగుణాలు వెలుగులోకి వస్తున్నాయి.
నీటి శాతం అధికంగా ఉండి, విటమిన్ C, జింక్, మేగ్నేషియం, ఐరన్ వంటి మినరల్స్ కొంత వరకు ఉండి మూత్రవ్యవస్థకి మేలును చేస్తుంది.
అదేవిధంగా ఫైబర్ కలిగి ఉండటం వల్ల జీర్ణవ్యవస్థకు మేలుచేస్తుంది.
* ఆయుర్వేదంలో కుశ్మండకి, బృహత్ఫలి అంటాము, అనేక ఔషధతయారీలో, అవలెహంగానూ వాడుతాము.
*శరీరంలో వేడి, కాక ఎక్కువగా ఉన్నవారికి, మూత్రములో సమస్య ఉన్నవారిలో చాలా ఫలితాన్నిస్తుంది.
* బూడిదగుమ్మడి రసం(జ్యూస్)తాగడం వలన జ్వరం, రక్తహీనత, మూత్రంలో మంట, కడుపులో వేడి సమస్యను తగ్గుతుంది.
* లేతగా ఉన్న గుమ్మడి రసం(జ్యూస్) వలన పైత్యం, మూత్రములో రాళ్లు, క్రిమిరోగం, అతిమూత్రం వంటి సమస్యలు తగ్గుతాయి.
* బరువు తగ్గాలనుకునే వాళ్ళు బూడిదగుమ్మడి ని తీసుకోవడం వలన పొట్ట నిండుగా ఉండి, ఎక్కువ తినాలనే కోరిక లేకుండా ఫలితం చూపిస్తుంది.
* శరీరంలో inflamation ఉంటే తగ్గిస్తుంది, అలాగే పొట్టలో పుండు(అల్సర్)ని కూడా తగ్గిస్తుంది.
* IBS అనే జీర్ణక్రియ సంబంధించిన సమస్య ను అదుపులో ఉంచుతుంది.
* ఇది మంచి antioxidant గా పనిచేస్తుంది.మెటబాలిజని సరిగా ఉంచుతుంది.
దేహవృధి, వీర్యవృద్ధి, మేధోవృద్ధి కలిగిస్తుంది.
#Ashgaurd #Ayurvedictip #Diuretic #Laxative #srichathurveda #Antioxidant
#Shamshabad
Dr.K.V.మాలతి BAMS
శ్రీ చతుర్వేద ఆయుర్వేదాలయం
శంషాబాద్.



కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి