#బూడిద గుమ్మడి-Ash Gaurd ఓం #ధన్వంతరే నమః బూడిదగుమ్మడిని చాలా రకాలుగా వాడతాము. విరివిగా లభించే ఈ గుమ్మడిలో ఎన్నో ఓషధ గుణాలు ఉన్నాయి. బూడిద గుమ్మడి ని, రసం,కల్కమ్, వంటల్లో, తీపిగా పేఠ మాదిరిగా వాడుతుంటాము. బూడిదగుమ్మడి పైన పరిశోధనల వలన ఇంకా మరిన్ని సుగుణాలు వెలుగులోకి వస్తున్నాయి. నీటి శాతం అధికంగా ఉండి, విటమిన్ C, జింక్, మేగ్నేషియం, ఐరన్ వంటి మినరల్స్ కొంత వరకు ఉండి మూత్రవ్యవస్థకి మేలును చేస్తుంది. అదేవిధంగా ఫైబర్ కలిగి ఉండటం వల్ల జీర్ణవ్యవస్థకు మేలుచేస్తుంది. * ఆయుర్వేదంలో కుశ్మండకి, బృహత్ఫలి అంటాము, అనేక ఔషధతయారీలో, అవలెహంగానూ వాడుతాము. *శరీరంలో వేడి, కాక ఎక్కువగా ఉన్నవారికి, మూత్రములో సమస్య ఉన్నవారిలో చాలా ఫలితాన్నిస్తుంది. * బూడిదగుమ్మడి రసం(జ్యూస్)తాగడం వలన జ్వరం, రక్తహీనత, మూత్రంలో మంట, కడుపులో వేడి సమస్యను తగ్గుతుంది. * లేతగా ఉన్న గుమ్మడి రసం(జ్యూస్) వలన పైత్యం, మూత్రములో రాళ్లు, క్రిమిరోగం, అతిమూత్రం వంటి సమస్యలు తగ్గుతాయి. * బరువు తగ్గాలనుకునే వాళ్ళు బూడిదగుమ్మడి ని తీసుకోవడం వలన పొట్ట నిండుగా ఉండి, ఎక్కువ తినాలనే కోరిక లేకుండా ఫలితం చూపిస్తుంది. * శరీరంలో in...
#Manda - గంజి - kaanji
#MANDA -#గంజి:
Manda-బియ్యపు గంజి:
పథ్యం అని ఆయుర్వేద వైద్యులు రోగికి ఉన్న జీర్ణశక్తి ని బట్టి,వారికి ఉన్న రోగంని బట్టి ప్రత్యేకంగా వివరించడం జరుగుతుంది.
ఆయుర్వేదంలో పథ్య - అపథ్యలు ముఖ్యపాత్రను పోషిస్తాయి. #స్వస్థవృత్తంలో, #దినచర్య మరియు #ఋతుచర్యల్లో వీటిని గురించి వివరాలు ఉన్నాయి.
శరీర శ్రోతస్సులకి హాని లేకుండా, శరీరానికి మేలుచేసే ఆహారాన్ని "#పథ్యం" అంటాము. ఇది ఆరోగ్యవంతులకి, రోగగ్రస్తులకి పాటించాల్సిన క్రియ.
ఇందులో మండా, పేయ, విలేపి, యావగు అనే రకాలుగా వివరణ ఉంటుంది.
ఇక్కడి మన విషయం గంజి గురించి....
* మండా అంటే వాడుక భాషలో గంజి. బియ్యం ఒకటికి 14 వంతులు నీళ్లు కలిపి అన్నం మెత్తగా ఉడికే వరకు ఉంచి, ఆ తర్వాత పైన ఉన్న నీటిని మనం మండా లేదా గంజి అంటాము.
* సులువుగా, అందరికి అందుబాటులో, తక్కువ ఖర్చుతో వుండే ఈ గంజి ఔషధంలా పనిచేస్తుందని చాలామందికి తెలియదు.
* ఇది లఘు, శీతవీర్యం ఉంటుంది.అగ్ని దీపనం, పాచనం, వాతాన్ని తగ్గించే గుణం, గ్రాహి వంటి గుణాలవల్ల జీర్ణవ్యవస్థను ఆరోగ్యాంగా ఉంచుతుంది. దప్పిక, ఆకలిని తగ్గించడంలో తోడ్పడుతుంది.దేహపుష్టి ఇస్తుంది.
* జ్వరం, నీళ్ళవిరేచనాలు, వాంతులు అయిన తరువాత, ఉపవాసం తరువాత, చాలా శ్రమ చేసాక గంజి అమృతంలా పనిచేస్తుంది.
* ఆయుర్వేద పంచకర్మలో గంజి కి ముఖ్యపాత్ర వుంది.ఇది వ్యాధిని బట్టి రకరకాలుగా చేసుకొని తీసుకోవచ్చు.
**ఉదా:గంజి లో పుదీనా, జీలకర్ర వంటివి కలిపి తాగడం వల్ల మూత్రo సాఫీగా ఉంటుంది.
**మరమరాలు తో గంజి వలన జ్వరం, అతిసారం లో ఉపశమనం ఉంటుంది.
**గోధుమలు, బార్లీ తో గంజి కూడా రక్తంపెంచడంతో పాటు, పైన చెప్పిన సమస్యల్లో ఉపయోగపడుతుంది.
**పెసరపప్పు, బియ్యం, త్రికటు, సైన్ధవలవణం కలిపి చేసిన గంజి త్రిదోషహారంగా పనిచేస్తుంది.
* ఇప్పుడు ఉన్న CORONA వైరస్ ప్రభావం వలన మన దినచర్య లో ఇటువంటి సులువుగా జీర్ణమయ్యే గంజి వంటివి ఉపయోగిస్తూ ఉంటే, Body Metabolism సరిగ్గా జరిగి, వ్యాధినిరోధక శక్తి పెరగడంలో సహాయపడుతుంది.
* అంతేకాదు ఇప్పుడు #CORONA వ్యాప్తి వేగంగా ఉండటం వలన, హోమ్ క్వారంటైన్లో వుంటున్నారు. అటువంటి వాళ్ళు గంజి ని, త్రికటు లేదా మిరియాల పొడితో తీసుకోవడం వలన కఫ గుణం తగ్గి, శరీరానికి తేలికదనం ఇస్తుంది.
* చిన్నపిల్లల్లో ఉండే పొట్ట సమస్యలు, అజీర్ణం, కడుపు బిగ్గరగా ఉండటం, సరిగా జీర్ణశక్తి లేని పిల్లల్లో గంజిని కొద్ది జీలకర్ర పొడితో పలుచగా చేసి తాపడం వలన దేహపుష్టి, బలం ని ఇస్తుంది.
* ఆరోగ్యవంతుల్లో కూడా గంజి దినచర్యలో వాడటం వల్ల ఆహారం మీద మక్కువ పెంచి, మనసుకి కూడా ఆహ్లాదాన్ని ఇచ్చి పంచభౌతిక శరీరాన్ని సరిగ్గా నిర్వహిస్తుంది.
సర్వేజనా సుఖినోభవంతు....
Dr.K.V.మాలతి BAMS
శ్రీ చతుర్వేద ఆయుర్వేదాలయం
శంషాబాద్.




Good information Doctor 🙏👍
రిప్లయితొలగించండి