#వెన్న - Fresh Butter
వెన్న - fresh butter
వెన్న అనగానే చిన్ని కృష్ణుడు గుర్తుకువస్తారు కదా... శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్బంగా వెన్న గురించి కొన్ని ఉపయోగపడే విషయాలు.....
** అప్పుడే తీసిన వెన్న తియ్యగా, కొంచం పులుపు గా ఉంటుంది. ఇది శరీరానికి కాంతి, బలము మరియు వీర్యవృద్ధి కలిగిస్తుంది. కళ్ళకు చలువనిస్తుంది.
** పాత వెన్న ఉప్పు, వగరు, పులుపు రుచులు, గురుగుణం కలిగి ఉంటుంది.కళ్ళకు,శిరస్సుకి బలాన్నిస్తుంది.
* వెన్న పంచదారతో కలిపి తినడం వల్ల గుండెకు, శరీరానికి బలం, వీర్యవృద్ధి ఇస్తుంది.
* వర్షాకాలంలో వెన్నను పంచకోలా చూర్ణం తో, వేసవిలో చక్కర తో తీసుకోవాలి.
* వెన్న వలన రక్తపితం, క్షయ, దగ్గు, వ్రణాలు, గాయాలు,గజ్జి, వాత సమస్యలు తగ్గుతాయి.
×× వెన్నని కఫరోగం ఉన్నవాళ్లు, మూర్ఛ, వాంతి, జ్వరం,రక్తహీనత, మొదలగు కఫజనిత వ్యాధులు వున్నవాళ్లు మితంగా తీసుకోవడం మంచిది.
అతిగా వెన్న తీసుకోవడంవల్ల అగ్నిమాంధ్యం, కఫం పెరగవొచ్చు అలాంటప్పుడు అల్లం, పంచదార, ఉప్పు వంటివి కలిపి తీసుకోవాలి.
#వెన్న పాలనుండి వచ్చిన పదార్థం, గురుత్వం అంటే heavy గా ఉంటుంది.ఎవరికైతే ఆకలి (జఠరాగ్ని) సరిగా ఉండి, జీర్ణక్రియ లో ఇబ్బంది ఉండనివాళ్ళు మాత్రం తీసుకుంటే మంచిది.
* పొడిచర్మం ఉన్నవాళ్లు రెండురోజులకి ఒకసారైనా వెన్నను చర్మంకి పట్టించడం వల్ల ఫలితం చక్కగా ఉంటుంది.
సర్వేజనా సుఖినోభవంతు...
Dr.K.V.మాలతి BAMS
శ్రీ చతుర్వేద ఆయుర్వేదాలయం
శంషాబాద్.


కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి