#కలబంద -Aloe vera
Aloe vera, కుమారి అని పేర్లు.జీవనవిధానంలో చాలా పరిచయం ఉన్న మొక్క. ఇందులోని ఔషధ గుణాలు మానవాళికి ఎంతో మేలు చేస్తాయి.
ఆకులు, పువ్వులు ముఖ్యమైన ఔషధ గుణాలను కలిగిఉంటాయి.
మధుమేహం, కీళ్ల నొప్పులు, ఉదర వ్యాధులు అంటే కాలేయం, ప్లీహ రోగాలు, స్త్రీలలో ఉండే గర్భాశయ సమస్యలు, చర్మ రోగుల్లో ఆయుర్వేదవైద్య నిపుణులు విరివిగా వాడుతుంటారు.
** కలబంద ఆకుల లోపలి జెల్లీవంటి గుజ్జును మంచి నీటితోశుభ్రంచేసి పటిక పంచదారతో కలిపి తింటే శరీరంలో వేడిచేయడాన్ని తగ్గిస్తుంది.
** కలబంద గుజ్జును పాత బెల్లంతో తినడం వలన కొన్ని రకాల గర్భాశయ సమస్యల్లో ఫలితం ఉంటుంది.
** గుజ్జులో పసుపు కలిపి తినడం వలన కాలేయ రోగం లో సహాయపడుతుంది.
** చర్మంకి వేడి మంట తగిలిన వెంటనే, గాయంపై కలబంద పెట్టడం వల్ల నొప్పి తగ్గుతుంది అలాగే చర్మ నష్టం ఎక్కువగా జరగదు.
** ప్రతిరోజు కొద్ది కొద్దిగా తినడం వలన శరీరంలో పైత్యం పెరగకుండా చూస్తుంది.
అలాగే ఇందులో ఉండే విటమిన్స్ A, C, E, విటమిన్ B12, మినరల్స్,ఆంటియాక్సిడెంట్ గా పనిచేస్తాయి.
అలాగే రక్తవృద్ధిలో తోడ్పడుతుంది.
** ఇలాంటి చాలా మంచి ఉపయోగాలు ఉన్న కలబంద మొక్క ప్రతి ఇంట్లో ఉండాలి.
ఎటువంటి డైట్ లో మార్పులు ఆయుర్వేదవైద్య నిపుణుల సలహా మేరకు నిర్ణయం తీసుకోవడం మంచిది.
సర్వేజనా సుఖినోభవంతు....
DR.K.V.మాలతి BAMS
శ్రీ చతుర్వేద ఆయుర్వేదాలయం
శంషాబాద్


కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి