ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

ఆగస్టు, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

AshGaurd -బూడిద గుమ్మడి

  #బూడిద గుమ్మడి-Ash Gaurd ఓం #ధన్వంతరే నమః బూడిదగుమ్మడిని చాలా రకాలుగా వాడతాము. విరివిగా లభించే ఈ గుమ్మడిలో ఎన్నో ఓషధ గుణాలు ఉన్నాయి. బూడిద గుమ్మడి ని, రసం,కల్కమ్, వంటల్లో, తీపిగా పేఠ  మాదిరిగా వాడుతుంటాము. బూడిదగుమ్మడి పైన పరిశోధనల వలన ఇంకా మరిన్ని సుగుణాలు వెలుగులోకి వస్తున్నాయి. నీటి శాతం అధికంగా ఉండి, విటమిన్ C, జింక్, మేగ్నేషియం, ఐరన్ వంటి మినరల్స్ కొంత వరకు ఉండి మూత్రవ్యవస్థకి మేలును చేస్తుంది. అదేవిధంగా ఫైబర్ కలిగి ఉండటం వల్ల జీర్ణవ్యవస్థకు మేలుచేస్తుంది. * ఆయుర్వేదంలో కుశ్మండకి, బృహత్ఫలి అంటాము, అనేక ఔషధతయారీలో, అవలెహంగానూ వాడుతాము. *శరీరంలో వేడి, కాక ఎక్కువగా ఉన్నవారికి, మూత్రములో సమస్య ఉన్నవారిలో చాలా ఫలితాన్నిస్తుంది. * బూడిదగుమ్మడి రసం(జ్యూస్)తాగడం వలన జ్వరం, రక్తహీనత, మూత్రంలో మంట, కడుపులో వేడి సమస్యను  తగ్గుతుంది. * లేతగా ఉన్న గుమ్మడి రసం(జ్యూస్) వలన పైత్యం, మూత్రములో రాళ్లు, క్రిమిరోగం, అతిమూత్రం వంటి సమస్యలు తగ్గుతాయి. * బరువు తగ్గాలనుకునే వాళ్ళు బూడిదగుమ్మడి ని తీసుకోవడం వలన పొట్ట నిండుగా ఉండి, ఎక్కువ తినాలనే కోరిక లేకుండా ఫలితం చూపిస్తుంది. * శరీరంలో in...

Aloevera- కలబంద

 #కలబంద -Aloe vera Aloe vera, కుమారి అని పేర్లు.జీవనవిధానంలో  చాలా పరిచయం ఉన్న మొక్క. ఇందులోని ఔషధ గుణాలు మానవాళికి ఎంతో మేలు చేస్తాయి.  ఆకులు, పువ్వులు ముఖ్యమైన ఔషధ గుణాలను కలిగిఉంటాయి. మధుమేహం, కీళ్ల నొప్పులు, ఉదర వ్యాధులు అంటే కాలేయం, ప్లీహ రోగాలు, స్త్రీలలో ఉండే గర్భాశయ సమస్యలు, చర్మ రోగుల్లో ఆయుర్వేదవైద్య నిపుణులు విరివిగా వాడుతుంటారు. ** కలబంద ఆకుల లోపలి జెల్లీవంటి గుజ్జును మంచి నీటితోశుభ్రంచేసి పటిక పంచదారతో కలిపి తింటే శరీరంలో వేడిచేయడాన్ని తగ్గిస్తుంది. ** కలబంద గుజ్జును పాత బెల్లంతో తినడం వలన కొన్ని రకాల గర్భాశయ సమస్యల్లో ఫలితం ఉంటుంది. ** గుజ్జులో పసుపు కలిపి తినడం వలన కాలేయ రోగం లో సహాయపడుతుంది. ** చర్మంకి వేడి  మంట తగిలిన వెంటనే, గాయంపై కలబంద పెట్టడం వల్ల నొప్పి తగ్గుతుంది అలాగే చర్మ నష్టం ఎక్కువగా జరగదు. ** ప్రతిరోజు కొద్ది కొద్దిగా తినడం వలన శరీరంలో పైత్యం పెరగకుండా చూస్తుంది.  అలాగే  ఇందులో ఉండే విటమిన్స్ A, C, E, విటమిన్  B12, మినరల్స్,ఆంటియాక్సిడెంట్ గా పనిచేస్తాయి. అలాగే రక్తవృద్ధిలో తోడ్పడుతుంది. ** ఇలాంటి చాలా మంచి ఉపయోగాలు ఉన్న కల...

#Fresh Butter - వెన్న

 #వెన్న - Fresh Butter వెన్న - fresh butter వెన్న అనగానే చిన్ని కృష్ణుడు గుర్తుకువస్తారు కదా... శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్బంగా వెన్న గురించి కొన్ని ఉపయోగపడే విషయాలు.....  ** అప్పుడే తీసిన వెన్న తియ్యగా, కొంచం పులుపు గా ఉంటుంది. ఇది శరీరానికి కాంతి, బలము మరియు వీర్యవృద్ధి కలిగిస్తుంది. కళ్ళకు చలువనిస్తుంది. ** పాత వెన్న ఉప్పు, వగరు, పులుపు రుచులు, గురుగుణం కలిగి ఉంటుంది.కళ్ళకు,శిరస్సుకి బలాన్నిస్తుంది. * వెన్న పంచదారతో కలిపి తినడం వల్ల గుండెకు, శరీరానికి బలం, వీర్యవృద్ధి ఇస్తుంది. * వర్షాకాలంలో వెన్నను పంచకోలా చూర్ణం తో, వేసవిలో చక్కర తో తీసుకోవాలి. * వెన్న వలన రక్తపితం, క్షయ, దగ్గు, వ్రణాలు, గాయాలు,గజ్జి,  వాత సమస్యలు తగ్గుతాయి. ×× వెన్నని కఫరోగం ఉన్నవాళ్లు, మూర్ఛ, వాంతి, జ్వరం,రక్తహీనత, మొదలగు కఫజనిత వ్యాధులు వున్నవాళ్లు మితంగా తీసుకోవడం మంచిది. అతిగా వెన్న తీసుకోవడంవల్ల అగ్నిమాంధ్యం, కఫం పెరగవొచ్చు అలాంటప్పుడు అల్లం, పంచదార, ఉప్పు  వంటివి కలిపి తీసుకోవాలి. #వెన్న పాలనుండి వచ్చిన పదార్థం, గురుత్వం అంటే heavy గా ఉంటుంది.ఎవరికైతే ఆకలి (జఠరాగ్ని) సరిగా ఉండి, జీర్ణక్రి...

#Manda - గంజి

#Manda - గంజి - kaanji #MANDA -#గంజి: Manda-బియ్యపు గంజి: పథ్యం అని ఆయుర్వేద వైద్యులు రోగికి ఉన్న జీర్ణశక్తి ని బట్టి,వారికి ఉన్న రోగంని బట్టి ప్రత్యేకంగా వివరించడం జరుగుతుంది.  ఆయుర్వేదంలో పథ్య - అపథ్యలు ముఖ్యపాత్రను పోషిస్తాయి. #స్వస్థవృత్తంలో, #దినచర్య మరియు #ఋతుచర్యల్లో వీటిని గురించి వివరాలు ఉన్నాయి.  శరీర శ్రోతస్సులకి హాని లేకుండా, శరీరానికి మేలుచేసే  ఆహారాన్ని "#పథ్యం" అంటాము. ఇది ఆరోగ్యవంతులకి, రోగగ్రస్తులకి పాటించాల్సిన క్రియ.  ఇందులో మండా, పేయ, విలేపి, యావగు అనే రకాలుగా వివరణ ఉంటుంది.  ఇక్కడి మన విషయం గంజి గురించి.... * మండా అంటే వాడుక భాషలో గంజి. బియ్యం ఒకటికి 14 వంతులు నీళ్లు కలిపి అన్నం మెత్తగా ఉడికే వరకు ఉంచి, ఆ  తర్వాత పైన ఉన్న నీటిని మనం మండా లేదా గంజి అంటాము.  * సులువుగా, అందరికి అందుబాటులో, తక్కువ ఖర్చుతో వుండే ఈ గంజి ఔషధంలా పనిచేస్తుందని చాలామందికి తెలియదు. * ఇది లఘు, శీతవీర్యం ఉంటుంది.అగ్ని దీపనం, పాచనం, వాతాన్ని తగ్గించే గుణం, గ్రాహి వంటి గుణాలవల్ల జీర్ణవ్యవస్థను ఆరోగ్యాంగా ఉంచుతుంది. దప్పిక, ఆకలిని తగ్గించడంలో తోడ్పడుతుంది.దేహపుష్...