#బూడిద గుమ్మడి-Ash Gaurd ఓం #ధన్వంతరే నమః బూడిదగుమ్మడిని చాలా రకాలుగా వాడతాము. విరివిగా లభించే ఈ గుమ్మడిలో ఎన్నో ఓషధ గుణాలు ఉన్నాయి. బూడిద గుమ్మడి ని, రసం,కల్కమ్, వంటల్లో, తీపిగా పేఠ మాదిరిగా వాడుతుంటాము. బూడిదగుమ్మడి పైన పరిశోధనల వలన ఇంకా మరిన్ని సుగుణాలు వెలుగులోకి వస్తున్నాయి. నీటి శాతం అధికంగా ఉండి, విటమిన్ C, జింక్, మేగ్నేషియం, ఐరన్ వంటి మినరల్స్ కొంత వరకు ఉండి మూత్రవ్యవస్థకి మేలును చేస్తుంది. అదేవిధంగా ఫైబర్ కలిగి ఉండటం వల్ల జీర్ణవ్యవస్థకు మేలుచేస్తుంది. * ఆయుర్వేదంలో కుశ్మండకి, బృహత్ఫలి అంటాము, అనేక ఔషధతయారీలో, అవలెహంగానూ వాడుతాము. *శరీరంలో వేడి, కాక ఎక్కువగా ఉన్నవారికి, మూత్రములో సమస్య ఉన్నవారిలో చాలా ఫలితాన్నిస్తుంది. * బూడిదగుమ్మడి రసం(జ్యూస్)తాగడం వలన జ్వరం, రక్తహీనత, మూత్రంలో మంట, కడుపులో వేడి సమస్యను తగ్గుతుంది. * లేతగా ఉన్న గుమ్మడి రసం(జ్యూస్) వలన పైత్యం, మూత్రములో రాళ్లు, క్రిమిరోగం, అతిమూత్రం వంటి సమస్యలు తగ్గుతాయి. * బరువు తగ్గాలనుకునే వాళ్ళు బూడిదగుమ్మడి ని తీసుకోవడం వలన పొట్ట నిండుగా ఉండి, ఎక్కువ తినాలనే కోరిక లేకుండా ఫలితం చూపిస్తుంది. * శరీరంలో in...
యష్టిమధు - అతిమధురం
Glycyrrhiza glarba, లికోరైస్, ములేఠి, అతిమధురం అని పేరు ఉన్న ఈ ఔషధమొక్క వేరు చూర్ణం, కషాయం తియ్యగా ఉంటుందని ఈ నామం.
యష్టిమధు వేరు చూర్ణం చాలా రకాల ఆయుర్వేద ఔషదమందుల్లో వాడుతారు.
మధుర రసం, స్నిగ్ధ గురు గుణం, శీత వీర్యం కలిగి ఉన్న ఈ మొక్క వేరుచూర్ణం మేహశాంతి అంటే మూత్రం ఇబ్బంది లేకుండా ఉండటంలో, పిత్త వాత సమస్యల్లో, చర్మ సమస్యల్లో చాలా లాభకారిగా ఉంటుంది.
అంతేకాకుండా కడుపులోని అల్సర్ కి చాలా వరకు తగ్గిస్తుంది.కడుపులో మంట, తలతిప్పడం, శరీరంలో వేడి, వాంతి లక్షణాలు తగ్గిస్తుంది.
* యష్టిమధు లో ఉండే Anti inflammatory గుణం వల్ల ఊపిరితిత్తుల సమస్యలు -పొడి దగ్గు, ఉబ్బసం, శ్వాసనాల inflamation,
అలాగే పేగుల్లో,మూత్రనాళాల్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ ను తగ్గించడంలో సహాయపడుతుంది.
* ఇందులో ఉండే antioxidants రోగనిరోధక శక్తి పెరగడంలో సహాయపడుతుంది.
* ఇందులో వుండే స్పాస్మోలైటిక్ గుణం వల్ల విరేచనాకారిగా ఉండి, పేగుల్లోని మ్యూకస్ పొరకి మేలు చేస్తుంది.
* యష్టిమధులో ఉండే ఆంటీ స్పాస్మోడిక్ యాక్షన్ వల్లన ఋతుక్రమంలో వుండే కడుపునొప్పి, అలసట తగ్గడానికి సహాయపడుతుంది.
* యష్టిమధు వేరు చూర్ణం అల్లంతో కలిపి వాడటం వల్ల దగ్గు లో ఉపశమనం ఉంటుంది.
* వేడిగా ఉన్న వేరు కషాయం టీ లాగా తీసుకోవడంలో ఋతుక్రమ కడుపునొప్పి తగ్గుతుంది.
* యష్టిమధు లేపనంలా, లేదా పై పూతగా వాడితే దీర్ఘకాలిక చర్మ సమస్యలు, పుండ్లు, నల్లమచ్చల్లో చాలా ఫలితం ఉంటుంది.
* యష్టిమధు నియమిత సమయం వరకు వాడాలి.BP, గర్భవతులు, పాలిచ్చే తల్లులు ఆయుర్వేద వైద్య నిపుణుల సలహా మేరకు మాత్రమే ఉపయోగించాలి.
> ఇప్పుడు ఉన్న CORONA వైరస్ కాలంలో ఈ యష్టిమధు గుడూచి కలిపి కషాయంలా తీసుకోవాలి.
> అలాగే యష్టిమధు కషాయం తో నోటిని పుక్కిలించడం వలన నోరు పొడి గా ఉండకుండా ఉంటుంది.
> యష్టిమధు చూర్ణం త్రికటు చూర్ణం+తేనె తో కలిపి చప్పరించడం వల్ల పొడిదగ్గు లో లాభం పొందవచ్చు.
సర్వేజనా సుఖినోభవంతు...
Dr.K.V.మాలతి BAMS
శ్రీ చతుర్వేద ఆయుర్వేదాలయం
శంషాబాద్.



Good one Doctor
రిప్లయితొలగించండి