#బూడిద గుమ్మడి-Ash Gaurd ఓం #ధన్వంతరే నమః బూడిదగుమ్మడిని చాలా రకాలుగా వాడతాము. విరివిగా లభించే ఈ గుమ్మడిలో ఎన్నో ఓషధ గుణాలు ఉన్నాయి. బూడిద గుమ్మడి ని, రసం,కల్కమ్, వంటల్లో, తీపిగా పేఠ మాదిరిగా వాడుతుంటాము. బూడిదగుమ్మడి పైన పరిశోధనల వలన ఇంకా మరిన్ని సుగుణాలు వెలుగులోకి వస్తున్నాయి. నీటి శాతం అధికంగా ఉండి, విటమిన్ C, జింక్, మేగ్నేషియం, ఐరన్ వంటి మినరల్స్ కొంత వరకు ఉండి మూత్రవ్యవస్థకి మేలును చేస్తుంది. అదేవిధంగా ఫైబర్ కలిగి ఉండటం వల్ల జీర్ణవ్యవస్థకు మేలుచేస్తుంది. * ఆయుర్వేదంలో కుశ్మండకి, బృహత్ఫలి అంటాము, అనేక ఔషధతయారీలో, అవలెహంగానూ వాడుతాము. *శరీరంలో వేడి, కాక ఎక్కువగా ఉన్నవారికి, మూత్రములో సమస్య ఉన్నవారిలో చాలా ఫలితాన్నిస్తుంది. * బూడిదగుమ్మడి రసం(జ్యూస్)తాగడం వలన జ్వరం, రక్తహీనత, మూత్రంలో మంట, కడుపులో వేడి సమస్యను తగ్గుతుంది. * లేతగా ఉన్న గుమ్మడి రసం(జ్యూస్) వలన పైత్యం, మూత్రములో రాళ్లు, క్రిమిరోగం, అతిమూత్రం వంటి సమస్యలు తగ్గుతాయి. * బరువు తగ్గాలనుకునే వాళ్ళు బూడిదగుమ్మడి ని తీసుకోవడం వలన పొట్ట నిండుగా ఉండి, ఎక్కువ తినాలనే కోరిక లేకుండా ఫలితం చూపిస్తుంది. * శరీరంలో in...
Sesame seeds-నువ్వులు
వంటల్లో ప్రతిరోజు ఏదో ఒక రూపంలో నువ్వులను వాడుతుంటాము. నూనె, పొడి, స్వీట్స్ ల్లో ఇలాగ...
కానీ నువ్వులు ఔషధంగా కూడా పనిచేస్తుంది అని చాలా వరకు తెలియదు.
శరీరంలో వేడి ని కలిగిస్తుంది.ఈ గుణం వల్ల శరీరంలో ఏర్పడ్డ వాతం(కీళ్ల వాతం ) ను తగ్గిస్తుంది.
అలాగే దేహపుష్టి, బలం, జటర దీప్తి,వీర్యవృద్ధి, మేధస్సు, కంఠధ్వని, రక్తవృద్ధి కలిగిస్తుంది.
నువ్వుల నూనె తక్కువ మోతాదు లో వంటల్లో వాడటం మంచిది.
అలాగే గోరువెచ్చగా వున్నపుడు నోట్లో వేసుకుని పుక్కిలించడం వల్ల నోటికి సంబందించిన సమస్యలు రాకుండా ఉంటాయి.
కరోనా వైరస్ కూడా వ్యాప్తి చెందకుండా ఉండటానికి అభ్యంగం, ముక్కులోనికి నస్యం గా కూడా వాడమని MINISTRY OF AYUSH సలహా ఇచ్చింది.
నువ్వుల్లో క్యాల్షియమ్ పుష్కలంగా ఉంటుంది.
నియమిత మాత్రంలో వేడి చేసి మాత్రమే వాడటం వలన పై చెప్పిన లాభాలను పొందవచ్చు.
దగ్గరలోని అర్హత కలిగిన ఆయుర్వేద వైద్యులను సంప్రదించి మాత్రమే ఆహారపు అలవాట్లలోని మార్పులు చేసుకోవడం ఉత్తమం.
సర్వేజనా సుఖినోభవంతు...
Dr.K.V.మాలతి
శ్రీ చతుర్వేద ఆయుర్వేదాలయం
శంషాబాద్.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి