#బూడిద గుమ్మడి-Ash Gaurd ఓం #ధన్వంతరే నమః బూడిదగుమ్మడిని చాలా రకాలుగా వాడతాము. విరివిగా లభించే ఈ గుమ్మడిలో ఎన్నో ఓషధ గుణాలు ఉన్నాయి. బూడిద గుమ్మడి ని, రసం,కల్కమ్, వంటల్లో, తీపిగా పేఠ మాదిరిగా వాడుతుంటాము. బూడిదగుమ్మడి పైన పరిశోధనల వలన ఇంకా మరిన్ని సుగుణాలు వెలుగులోకి వస్తున్నాయి. నీటి శాతం అధికంగా ఉండి, విటమిన్ C, జింక్, మేగ్నేషియం, ఐరన్ వంటి మినరల్స్ కొంత వరకు ఉండి మూత్రవ్యవస్థకి మేలును చేస్తుంది. అదేవిధంగా ఫైబర్ కలిగి ఉండటం వల్ల జీర్ణవ్యవస్థకు మేలుచేస్తుంది. * ఆయుర్వేదంలో కుశ్మండకి, బృహత్ఫలి అంటాము, అనేక ఔషధతయారీలో, అవలెహంగానూ వాడుతాము. *శరీరంలో వేడి, కాక ఎక్కువగా ఉన్నవారికి, మూత్రములో సమస్య ఉన్నవారిలో చాలా ఫలితాన్నిస్తుంది. * బూడిదగుమ్మడి రసం(జ్యూస్)తాగడం వలన జ్వరం, రక్తహీనత, మూత్రంలో మంట, కడుపులో వేడి సమస్యను తగ్గుతుంది. * లేతగా ఉన్న గుమ్మడి రసం(జ్యూస్) వలన పైత్యం, మూత్రములో రాళ్లు, క్రిమిరోగం, అతిమూత్రం వంటి సమస్యలు తగ్గుతాయి. * బరువు తగ్గాలనుకునే వాళ్ళు బూడిదగుమ్మడి ని తీసుకోవడం వలన పొట్ట నిండుగా ఉండి, ఎక్కువ తినాలనే కోరిక లేకుండా ఫలితం చూపిస్తుంది. * శరీరంలో in...
Mouth Gargling-కవళం:
ఆయుర్వేద గ్రంథాలు అయిన అష్టాంగ హృదయం, చరక మరియు శుశ్రుత సంహితాల్లో ఈ కవళం గురించి ప్రత్యేక సందర్భాల్లో వివరించారు.
గండూషము-అంటే నోటిలో ద్రవం ఉంచుకొని నియమిత సమయం వరకు కదపకుండా ఉంచడం.
కవళం-అంటే నోట్లో ద్రవం ఉంచి సాధ్యమైనన్ని సార్లు కదిలించడం అంటే పుక్కిలించడం.
ఇది ప్రతిరోజు మనం చేసే ప్రక్రియే అయితే ఈ కరోనా కాలంలో ఎంతో సహాయపడే విధానం గురించి ఈ వివరణ.
ఆయుర్వేదంలో కవళం 4రకాలుగా చెప్పడం జరిగింది.
1.స్నేహిక-మృదుత్వం, దోష హారం కొరకు
2.శమన -కఫ వాత లక్షణాలను బట్టి
3.శోధన -శుభ్రంగా ఉండటానికి
4.రోపణ-నోటిలోని పుండ్లు తగ్గడం కొరకు etc
కరోనా వైరస్ నుండి కాపాడుకోవడానికి, రాకుండా ఉండటానికి మనకి రెండు రకాలు ఉపయోగపడతాయి అవి :
శోధన:బయటకి వెళ్లొచ్చిన తర్వాత, ఉదయం, ఎవరైతే కరోనా వ్యాధిగ్రస్థులో, అటువంటి వాళ్ళు శోధన కవళం చేయాలి.ఉప్పు నీళ్లు, గోరువెచ్చని నీళ్లు, ఆమ్లకి, యష్టిమధు, త్రిఫల వంటి కాషాయలతో నోటిని శుభ్రం చేసుకోవాలి.
స్నేహిక:నోటిని శుబ్రపరిచాక oil pulling చేయాలి.గోరు వెచ్చని నువ్వుల నూనె, కొబ్బరి నూనె వంటివి వాడవచ్చు.దీనివల్ల నోటి లోని మ్యూకస్ స్నిగ్ధంగా మారి, కరోనా యొక్క ప్రోటీన్ లేయర్ తో కలవకుండా సహాయ పడుతుంది అని ఒక పరిశోధనలో వెల్లడైంది.
Oil pulling వల్ల పళ్లలో పాచు పట్టకుండా ఆరోగ్యమైన నోటికుహరం ఏర్పడుతుంది.దీనివల్ల మైక్రోఆర్గనిసమ్స్ యొక్క కౌంట్ కూడా తగ్గుతుంది.
అంతేకాదు covid19 లో వచ్చే మొదటి లక్షణం పొడిదగ్గులో కూడా ఉపశమనం ఇస్తుంది.
ప్రతిరోజు దినచర్యలో oilpulling భాగంగా చేస్తూ ఉంటే
>దవడ మరియు ముఖం యొక్క కండరాలు బలంగా ఉంటాయి.
>దంత మరియు చిగుళ్లు సమస్యలు లేకుండా ఆరోగ్యాంగా ఉంటాయి.
>నోటికి రుచిని కలిగించి, ఆకలిని కూడా పెంచుతుంది.
కరోనా వ్యాధిగ్రస్థులు రెండుగంటలకు ఒకసారి oilpulling 3 నుండి 5నిముషాలు వరకు చేసినా ఉపశమనం ఉంటుంది.
సర్వేజనా సుఖినోభవంతు...
Dr.K.V.మాలతి BAMS
శ్రీ చతుర్వేద ఆయుర్వేదాలయం
శంషాబాద్.

Nice one Dr.Malathi
రిప్లయితొలగించండి