ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

AshGaurd -బూడిద గుమ్మడి

  #బూడిద గుమ్మడి-Ash Gaurd ఓం #ధన్వంతరే నమః బూడిదగుమ్మడిని చాలా రకాలుగా వాడతాము. విరివిగా లభించే ఈ గుమ్మడిలో ఎన్నో ఓషధ గుణాలు ఉన్నాయి. బూడిద గుమ్మడి ని, రసం,కల్కమ్, వంటల్లో, తీపిగా పేఠ  మాదిరిగా వాడుతుంటాము. బూడిదగుమ్మడి పైన పరిశోధనల వలన ఇంకా మరిన్ని సుగుణాలు వెలుగులోకి వస్తున్నాయి. నీటి శాతం అధికంగా ఉండి, విటమిన్ C, జింక్, మేగ్నేషియం, ఐరన్ వంటి మినరల్స్ కొంత వరకు ఉండి మూత్రవ్యవస్థకి మేలును చేస్తుంది. అదేవిధంగా ఫైబర్ కలిగి ఉండటం వల్ల జీర్ణవ్యవస్థకు మేలుచేస్తుంది. * ఆయుర్వేదంలో కుశ్మండకి, బృహత్ఫలి అంటాము, అనేక ఔషధతయారీలో, అవలెహంగానూ వాడుతాము. *శరీరంలో వేడి, కాక ఎక్కువగా ఉన్నవారికి, మూత్రములో సమస్య ఉన్నవారిలో చాలా ఫలితాన్నిస్తుంది. * బూడిదగుమ్మడి రసం(జ్యూస్)తాగడం వలన జ్వరం, రక్తహీనత, మూత్రంలో మంట, కడుపులో వేడి సమస్యను  తగ్గుతుంది. * లేతగా ఉన్న గుమ్మడి రసం(జ్యూస్) వలన పైత్యం, మూత్రములో రాళ్లు, క్రిమిరోగం, అతిమూత్రం వంటి సమస్యలు తగ్గుతాయి. * బరువు తగ్గాలనుకునే వాళ్ళు బూడిదగుమ్మడి ని తీసుకోవడం వలన పొట్ట నిండుగా ఉండి, ఎక్కువ తినాలనే కోరిక లేకుండా ఫలితం చూపిస్తుంది. * శరీరంలో in...

Lemon-నిమ్మకాయ

నిమ్మకాయ-Lemon

ఓం ధన్వంతరే నమః 

నిమ్మకాయ :

పుల్లని రుచి ని కలిగి ఉండి మన రోజువారి వంటల్లోను,  చిన్న చిన్న సమస్యలకి ఇంటి చిట్కాల్లోను  ఎంతో ఉపయోగపడే నిమ్మకాయ గురించి మరి కొన్ని విషయాలు... 

ఆయుర్వేదంలో కొన్ని రకాల ఔషధ తయారీలో,  అలాగే రోగం ని దృష్టి పెట్టుకుని అనుపానంగా కూడా వాడతాము. 

ఆమ్ల రసం, లఘు తీక్ష్ణ, ఉష్ణ వీర్యం నిమ్మ యొక్క గుణాలు.ఇది ఎక్కువగా వాత కఫ దోష హారంగా ఉండి, కొద్దివరకు పిత్తం ని పెంచుతుంది.

ఆయుర్వేదంలో నిమ్మకాయని కంటి, చర్మ సమస్యల్లో, ఎక్కిళ్ళు, దప్పిక, వాంతి, శ్వాస,  కఫం, మలబద్దకం, కంఠం పై  భాగ రోగాల్లో, జ్వరం, పొట్టకు సంబంధించిన సమస్యల్లో యుక్తి తో వాడతారు.

నిమ్మకాయ లో Vit C, citric acid తో పాటు Vit A, hesparidin, mallic acid వంటి రసాయనాలు మనకు ఆరోగ్యాన్ని అందించడంలో లాభ పడుతాయి. 

* మూత్రపిండాల్లో రాళ్లకు నిమ్మకాయ రసం మంచి ఔషధం. ఇందులో ఉండే citric acid మూత్రం ని సాఫీ గా వెళ్ళడానికి, అలాగే మూత్రం ph సరిచేయడానికి తోడవుతుంది. 

* రక్తం ఆల్కలీన్ (ఆమ్ల నుండి క్షారo)గా మార్చడానికి ఎంతో సహాయపడుతుంది. 

*రక్తహీనతలో నిమ్మ, నారింజ, బత్తాయి వంటి పళ్ళు వాడుతాము. ఇందులో వుండే రసాయనాలు మనం తీసుకున్న ఆహారం తాలూకు iron ని గ్రహించడానికి తోడ్పడుతాయి.

దీని కారణంగా ఐరన్ డెఫెసిఎన్సీ అనీమియా తగ్గడంలో మేలు చేస్తుంది. 

* నిమ్మ లో ఉండే ఫైబర్ మరియు రసాయనాలు జీర్ణవ్యవస్థకు ఎంతగానో మంచిది. 
ఆకలిని పెంచుతుంది.దాహం, అరుచిని తగ్గిస్తుంది.
జీర్ణక్రియలో కూడా తోడ్పడుతుంది.

నిమ్మ ని గుజ్జుతో పాటు తినడం వల్ల, అందులో వుండే ఫైబర్ కూడా  అందుతుంది.

* బరువు, శరీరంలో చక్కర స్థాయిలను తగ్గించడంలో  కూడా నిమ్మరసం బాగా ఉపయోగపడుతుంది.
నిమ్మ తొక్క ఇందుకు బాగా మంచిది.

* నిమ్మరసం కాన్సర్ కణాలు శరీర ఇతర భాగాలకు వ్యాప్తి చెందకుండా ఉంచుతుంది అని ఒక పరిశోధనలో రుజువైంది.

* నిమ్మకాయ రసం సమభాగం నీళ్లు, పంచదార కలిపి తాగితే వాంతులు తగ్గుతాయి.

*  కానీ ఛాతిలో నంజు ఉన్నవారికి, వాత శ్లేష్మ ప్రకృతి వాళ్ళకి ఎక్కవ తీసుకుంటే కొంతవరకు ఇది హాని కలిగిస్తుంది.

ఎప్పుడైనా నిమ్మరసంని నీళ్లు, తేనె, చక్కర, ఉప్పు, ఖర్జుర రసంతో తీసుకోవాలి.

** ఇప్పుడు  ఉన్న CORONA  సమస్యకి కూడా నిమ్మకాయ కొంతవరకు మనకి లాభకారి.
వేడినీటిలో నిమ్మకాయ రసం కలిపి నెమ్మదిగ తీసుకుంటూ ఉండాలి.
 
నోటి ని శుభ్రాంగా ఉంచడమే కాకుండా, గొంతులోని ఇన్ఫెక్షన్ తగ్గించే అవకాశం ఉంది.

అలాగే రక్తం ఆల్కలైన్ గా మారటంతో, రోగనిరోధక శక్తిపెరగానికి తోడ్పడుతుంది.

సర్వేజనా సుఖినోభవంతు...

DR.K.V.మాలతి BAMS 
శ్రీ చతుర్వేద ఆయుర్వేదాలయం 
శంషాబాద్.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

AshGaurd -బూడిద గుమ్మడి

  #బూడిద గుమ్మడి-Ash Gaurd ఓం #ధన్వంతరే నమః బూడిదగుమ్మడిని చాలా రకాలుగా వాడతాము. విరివిగా లభించే ఈ గుమ్మడిలో ఎన్నో ఓషధ గుణాలు ఉన్నాయి. బూడిద గుమ్మడి ని, రసం,కల్కమ్, వంటల్లో, తీపిగా పేఠ  మాదిరిగా వాడుతుంటాము. బూడిదగుమ్మడి పైన పరిశోధనల వలన ఇంకా మరిన్ని సుగుణాలు వెలుగులోకి వస్తున్నాయి. నీటి శాతం అధికంగా ఉండి, విటమిన్ C, జింక్, మేగ్నేషియం, ఐరన్ వంటి మినరల్స్ కొంత వరకు ఉండి మూత్రవ్యవస్థకి మేలును చేస్తుంది. అదేవిధంగా ఫైబర్ కలిగి ఉండటం వల్ల జీర్ణవ్యవస్థకు మేలుచేస్తుంది. * ఆయుర్వేదంలో కుశ్మండకి, బృహత్ఫలి అంటాము, అనేక ఔషధతయారీలో, అవలెహంగానూ వాడుతాము. *శరీరంలో వేడి, కాక ఎక్కువగా ఉన్నవారికి, మూత్రములో సమస్య ఉన్నవారిలో చాలా ఫలితాన్నిస్తుంది. * బూడిదగుమ్మడి రసం(జ్యూస్)తాగడం వలన జ్వరం, రక్తహీనత, మూత్రంలో మంట, కడుపులో వేడి సమస్యను  తగ్గుతుంది. * లేతగా ఉన్న గుమ్మడి రసం(జ్యూస్) వలన పైత్యం, మూత్రములో రాళ్లు, క్రిమిరోగం, అతిమూత్రం వంటి సమస్యలు తగ్గుతాయి. * బరువు తగ్గాలనుకునే వాళ్ళు బూడిదగుమ్మడి ని తీసుకోవడం వలన పొట్ట నిండుగా ఉండి, ఎక్కువ తినాలనే కోరిక లేకుండా ఫలితం చూపిస్తుంది. * శరీరంలో in...

త్రికటు:

త్రికటు: అనగా శుంఠి, పిప్పలి, మిరియాలు మూడింటిని కలిపి ఆయుర్వేదంలో త్రికటు అని, త్రియూషము అని అంటాము.  ఇది శరీరంలో ఏర్పడ్డ కఫం,కొలెస్ట్రాల్  అంటే అధిక బరువు, శ్వాస, కాస, చర్మరోగాలు, గొంతులోని సమస్యలు, వాపులు, ఉదరరోగ వంటి సమస్యలు నివారించడానికి  వైద్యులు వాడుతుంటాము.   ఇందులో శుంఠి-అల్లం పొడి, పిప్పళ్లు, మిరియాలు సమపాళ్లలో పొడిగా చేస్తారు.ఇవి మూడు కూడా కటు రసం అంటే కారం వంటి రుచి ని కలిగి వుంటాయని దీనికి ఈ పేరు.  మూడు కూడా ఉష్ణ వీర్యం ని కలిగి ఉంటాయి అంటే మనం ఈ ఔషధం తింటే శరీరంలో వేడిని పుట్టిస్తుంది.  ఈ లక్షణం వల్లనే ఉబ్బసం, ఆస్తమా, దగ్గు, దమ్ము,ఊపిరితిత్తుల సమస్యలు,  లావు,గర్భాశయ సమస్యలు, థైరాయిడ్, మధుమేహం, PCOD, ఆమవాతం (రుమటాయిడ్ ఆర్తరైటిస్ )వంటి కఫం-వాత  సంబంధ సమస్యల్లో బాగా ఉపశమనం ఇస్తుంది.  అలాగే ఇందులోని  శుంఠి జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు అంటే అరుచి, అజీర్ణం, IBS లో సరిఅయిన అనుపానం, మోతాదుతో వాడితే ఉపశమనం ఇస్తుంది. అలాగే ముఖ్యంగా రోగనిరోధక శక్తి పెంచడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది.ఇప్పుడు ఉన్న  కరోనా వైరస్ నుండి తట్టుక...

#వాము - Carum seeds

 వాము -Ajwain, carum seeds:  వంటింట్లో తప్పనిసరిగా ఉండే ఈ సుగంధద్రవ్యం చక్కటి ఔషధం. చిన్నపిల్లల మొదలు వృధ్దాప్యం వరకు అందరికి మేలు చేసే వాము గురించి మరిన్ని వివరాలు..  కారం, వగరు రుచి, ఉష్ణవీర్యం కలిగి ఉంటుంది.  వాము చెట్టు యొక్క ఫలాలు "వాముగింజలు". చూర్ణంగా, కషాయంగా, నేరుగా వాడటం జరుగుతుంది.  వాము లో ఉండే రసాయనాలు, ఆయిల్స్, విటమిన్స్, మినరల్స్, యాంటియోక్సిడెంట్స్ గాను, శరీరసమస్యలకు మందులా పనిచేస్తాయి.  * జీర్ణక్రియ:జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యల్లో కడుపుబ్బరం, అధికవాయువు, అజీర్ణం, ఆకలి లేకపోవడం, పొట్ట బరువుగా అనిపించడం వంటి సమస్యల్లో త్వరగా ఉపశమనం ఇస్తుంది.  * శరీర బరువు తగ్గించడంలో, అధిక కొలెస్ట్రాల్ తగ్గించడంలో చక్కగా ఉపయోగపడుతుంది.  *blood ప్రెషర్ ఎక్కువగా ఉన్నవారిలో లెవెల్  సాధారణస్థాయికి తేవడంతో పాటు, గుండెకి సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి.  * అంతేకాకుండా AntiInflammatory లక్షణం వలన పొట్టలోని సమస్యలు, మూత్రమార్గ ఇన్ఫెక్షన్ లు, ఉబ్బసం వంటి సమస్యల్లో బాగా ఉపశమనం ఇస్తుంది. * అలాగే వీర్యవృద్ధి, ఋతుక్రమం సరిచేస్తుంది. > వాము వేడ...