ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

జులై, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

AshGaurd -బూడిద గుమ్మడి

  #బూడిద గుమ్మడి-Ash Gaurd ఓం #ధన్వంతరే నమః బూడిదగుమ్మడిని చాలా రకాలుగా వాడతాము. విరివిగా లభించే ఈ గుమ్మడిలో ఎన్నో ఓషధ గుణాలు ఉన్నాయి. బూడిద గుమ్మడి ని, రసం,కల్కమ్, వంటల్లో, తీపిగా పేఠ  మాదిరిగా వాడుతుంటాము. బూడిదగుమ్మడి పైన పరిశోధనల వలన ఇంకా మరిన్ని సుగుణాలు వెలుగులోకి వస్తున్నాయి. నీటి శాతం అధికంగా ఉండి, విటమిన్ C, జింక్, మేగ్నేషియం, ఐరన్ వంటి మినరల్స్ కొంత వరకు ఉండి మూత్రవ్యవస్థకి మేలును చేస్తుంది. అదేవిధంగా ఫైబర్ కలిగి ఉండటం వల్ల జీర్ణవ్యవస్థకు మేలుచేస్తుంది. * ఆయుర్వేదంలో కుశ్మండకి, బృహత్ఫలి అంటాము, అనేక ఔషధతయారీలో, అవలెహంగానూ వాడుతాము. *శరీరంలో వేడి, కాక ఎక్కువగా ఉన్నవారికి, మూత్రములో సమస్య ఉన్నవారిలో చాలా ఫలితాన్నిస్తుంది. * బూడిదగుమ్మడి రసం(జ్యూస్)తాగడం వలన జ్వరం, రక్తహీనత, మూత్రంలో మంట, కడుపులో వేడి సమస్యను  తగ్గుతుంది. * లేతగా ఉన్న గుమ్మడి రసం(జ్యూస్) వలన పైత్యం, మూత్రములో రాళ్లు, క్రిమిరోగం, అతిమూత్రం వంటి సమస్యలు తగ్గుతాయి. * బరువు తగ్గాలనుకునే వాళ్ళు బూడిదగుమ్మడి ని తీసుకోవడం వలన పొట్ట నిండుగా ఉండి, ఎక్కువ తినాలనే కోరిక లేకుండా ఫలితం చూపిస్తుంది. * శరీరంలో in...

Lemon-నిమ్మకాయ

నిమ్మకాయ-Lemon ఓం ధన్వంతరే నమః  నిమ్మకాయ : పుల్లని రుచి ని కలిగి ఉండి మన రోజువారి వంటల్లోను,  చిన్న చిన్న సమస్యలకి ఇంటి చిట్కాల్లోను  ఎంతో ఉపయోగపడే నిమ్మకాయ గురించి మరి కొన్ని విషయాలు...  ఆయుర్వేదంలో కొన్ని రకాల ఔషధ తయారీలో,  అలాగే రోగం ని దృష్టి పెట్టుకుని అనుపానంగా కూడా వాడతాము.  ఆమ్ల రసం, లఘు తీక్ష్ణ, ఉష్ణ వీర్యం నిమ్మ యొక్క గుణాలు.ఇది ఎక్కువగా వాత కఫ దోష హారంగా ఉండి, కొద్దివరకు పిత్తం ని పెంచుతుంది. ఆయుర్వేదంలో నిమ్మకాయని కంటి, చర్మ సమస్యల్లో, ఎక్కిళ్ళు, దప్పిక, వాంతి, శ్వాస,  కఫం, మలబద్దకం, కంఠం పై  భాగ రోగాల్లో, జ్వరం, పొట్టకు సంబంధించిన సమస్యల్లో యుక్తి తో వాడతారు. నిమ్మకాయ లో Vit C, citric acid తో పాటు Vit A, hesparidin, mallic acid వంటి రసాయనాలు మనకు ఆరోగ్యాన్ని అందించడంలో లాభ పడుతాయి.  * మూత్రపిండాల్లో రాళ్లకు నిమ్మకాయ రసం మంచి ఔషధం. ఇందులో ఉండే citric acid మూత్రం ని సాఫీ గా వెళ్ళడానికి, అలాగే మూత్రం ph సరిచేయడానికి తోడవుతుంది.  * రక్తం ఆల్కలీన్ (ఆమ్ల నుండి క్షారo)గా మార్చడానికి ఎంతో సహాయపడుతుంది.  *రక్తహీనతలో నిమ్మ, నారిం...

Yastimadhu-అతిమధురం

   Yastimadhu-అతిమధురం  ఓమ్ ధన్వంతరే నమః యష్టిమధు - అతిమధురం  Glycyrrhiza glarba, లికోరైస్, ములేఠి, అతిమధురం అని పేరు  ఉన్న ఈ ఔషధమొక్క వేరు చూర్ణం, కషాయం తియ్యగా ఉంటుందని ఈ నామం.  యష్టిమధు వేరు చూర్ణం చాలా రకాల ఆయుర్వేద ఔషదమందుల్లో వాడుతారు.  మధుర రసం, స్నిగ్ధ గురు గుణం, శీత వీర్యం కలిగి ఉన్న ఈ మొక్క వేరుచూర్ణం మేహశాంతి అంటే మూత్రం ఇబ్బంది లేకుండా ఉండటంలో, పిత్త వాత సమస్యల్లో, చర్మ సమస్యల్లో చాలా లాభకారిగా ఉంటుంది.  అంతేకాకుండా కడుపులోని అల్సర్ కి చాలా వరకు తగ్గిస్తుంది.కడుపులో మంట, తలతిప్పడం, శరీరంలో వేడి, వాంతి లక్షణాలు తగ్గిస్తుంది. * యష్టిమధు లో  ఉండే Anti inflammatory గుణం వల్ల ఊపిరితిత్తుల సమస్యలు -పొడి దగ్గు, ఉబ్బసం, శ్వాసనాల inflamation,   అలాగే పేగుల్లో,మూత్రనాళాల్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ ను తగ్గించడంలో సహాయపడుతుంది.   * ఇందులో ఉండే  antioxidants  రోగనిరోధక శక్తి పెరగడంలో సహాయపడుతుంది. * ఇందులో వుండే   స్పాస్మోలైటిక్ గుణం వల్ల విరేచనాకారిగా ఉండి, పేగుల్లోని మ్యూకస్ పొరకి మేలు చేస్తుంది. * యష్టిమధులో ఉం...

Tenospora cardifolia-గుడూచి

Guduchi-గుడూచి గుడూచి-తిప్పతీగ: Tinospora cordifolia, గిలోయ్, అమృత, గుడూచి వంటి పేర్లు కలిగి ఉన్న ఈ తీగ మన జీవితానికి  అమృతం మాదిరిగా చెప్పవచ్చు. NECTAR OF LIFE.  ఆయుర్వేదంలో అమృత ఆకు, కాడ, వేర్ల -స్వరసం,  చూర్ణం, కషాయం,బిళ్ళలు గా  వివిధ వ్యాధులకు తగ్గ అనుపానంతో వాడతాము. ఇది ఉష్ణ గుణం అంటే వేడి కలిగిస్తుంది.Allergic Rhinitis, దగ్గు, దమ్ము, ఆస్తమా వంటి పరిస్థుతుల్లో ఉపయోగించవచ్చు. ఆయుర్వేదం పరంగా  చెప్పాలంటే రసాయనం, బల్యం, సంగ్రాహి, త్రిదోష షామక, అగ్నిదీపక, మేహనశక  వంటి సద్గుణాలు కలిగి రోగికి ఉన్న సమస్యలు తీసేసి ఆరోగ్యమైన జీవితం అందిస్తుంది. పేరుకు తగ్గట్టు అమృతం అంటే దీర్ఘకాలిక  జ్వరం, మధుమేహం, అధికబరువు, కీళ్ళవాతము ముఖ్యంగా gout, కాలేయ వ్యాధులు హెపటైటిస్, పొట్ట సమస్యలు అల్సర్,ఎలర్జిక్ సమస్యల్లో, ముఖ్యంగా రోగ నిరోధక శక్తి పెంచడంలో ఎంతగానో సహాయపడుతుంది. గుడూచి లో వుండే ఆల్కలాయిడ్స్, గ్లైకోసైడ్స్, ఫెనికాల్స్ వంటి ఇతర  రసాయనాలు * ఏంటిఇన్ఫ్లమాటరీ-gout వంటి కీళ్ళవాతంలో   * ఏంటి హైపెర్గ్లైసెమిక్-మధుమేహం లో  * ఏంటి పైరెటిక్-విషజ్వరాలు ...

Sesame seeds

Sesame seeds-నువ్వులు వంటల్లో ప్రతిరోజు ఏదో ఒక రూపంలో నువ్వులను వాడుతుంటాము. నూనె, పొడి, స్వీట్స్ ల్లో ఇలాగ...  కానీ నువ్వులు ఔషధంగా కూడా పనిచేస్తుంది అని చాలా వరకు తెలియదు. శరీరంలో వేడి ని కలిగిస్తుంది.ఈ గుణం వల్ల శరీరంలో ఏర్పడ్డ వాతం(కీళ్ల వాతం ) ను తగ్గిస్తుంది. అలాగే దేహపుష్టి, బలం, జటర దీప్తి,వీర్యవృద్ధి, మేధస్సు, కంఠధ్వని, రక్తవృద్ధి కలిగిస్తుంది.   అర్శమొలలు, చర్మవ్యాధులు, ఋతుక్రమ సమస్యల్లో   నువ్వులు ఎంతగానో ఉపయోగపడతాయి.  నువ్వుల నూనె తక్కువ మోతాదు లో వంటల్లో వాడటం మంచిది.  అలాగే గోరువెచ్చగా వున్నపుడు నోట్లో వేసుకుని పుక్కిలించడం వల్ల నోటికి సంబందించిన సమస్యలు రాకుండా ఉంటాయి. కరోనా వైరస్ కూడా వ్యాప్తి చెందకుండా ఉండటానికి అభ్యంగం, ముక్కులోనికి నస్యం గా కూడా వాడమని MINISTRY OF AYUSH సలహా ఇచ్చింది.  నువ్వుల్లో క్యాల్షియమ్ పుష్కలంగా ఉంటుంది.  నియమిత  మాత్రంలో వేడి చేసి మాత్రమే వాడటం వలన పై చెప్పిన లాభాలను పొందవచ్చు. దగ్గరలోని అర్హత కలిగిన ఆయుర్వేద వైద్యులను సంప్రదించి మాత్రమే  ఆహారపు అలవాట్లలోని మార్పులు చేసుకోవడం ఉత్తమం. సర్వేజనా సు...

Cumin seeds:

జీలకర్ర- cumin seeds: జీలకర్ర: వంటకాలకు సువాసన, రుచిని కలిగిస్తుంది. ఇది శరీరంలో ఉష్ణంని  పెంచుతుంది. జఠరదీప్తీ, వీర్యవృద్ధి,బలం ను కలిగిస్తుంది. వాత మరియు కఫహారం, మలబద్దకం, మూత్రంలో మంట, రక్తం తోకూడిన అతిసారం,  తల తిప్పడం, జ్వరం, శరీరనొప్పులు, బహిష్టు సమస్యలను అదుపుచేస్తుంది. జీలకర్ర పరిమిత మాత్రలో ఉపయోగిస్తే ప్రేగులకు, కాలేయం, మూత్రపిండాలకు బలమును కలిగిస్తుంది.  *1గ్లాసు నీళ్లు 1/4 చెంచా వేయించిన జీలకర్ర పొడి, అల్లంరసం కొద్దిగా, సోంపు అరచెంచా వేసి మరిగించిన  నీళ్లను,  చిటికెడు సైoధవలవణం తో తీసికుంటే జీర్ణాశయ సమస్యలు తగ్గుతాయి. *వేయించి పొడి చేసిన జీలకర్ర, సరిఅయిన మోతాదు లో సైoధవ లవణం కలుపుకొని నిలువచేసుకొని, వాంతులు అయ్యే వారికి  కొద్దికొద్దిగా ఇవ్వడం వలన ఉపశమనం ఉంటుoది. సర్వేజనా సుఖినోభవంతు.... Dr.K.V.మాలతి BAMS శ్రీ చతుర్వేద ఆయుర్వేదాలయం  శంషాబాద్.

Mouth Gargling:

Mouth Gargling-కవళం: ఆయుర్వేద గ్రంథాలు అయిన  అష్టాంగ హృదయం, చరక మరియు శుశ్రుత సంహితాల్లో ఈ కవళం గురించి ప్రత్యేక సందర్భాల్లో వివరించారు. గండూషము-అంటే నోటిలో ద్రవం ఉంచుకొని నియమిత సమయం వరకు కదపకుండా ఉంచడం. కవళం-అంటే నోట్లో ద్రవం ఉంచి సాధ్యమైనన్ని సార్లు కదిలించడం అంటే పుక్కిలించడం.  ఇది ప్రతిరోజు మనం చేసే ప్రక్రియే అయితే ఈ కరోనా కాలంలో ఎంతో సహాయపడే విధానం గురించి ఈ వివరణ.  ఆయుర్వేదంలో కవళం 4రకాలుగా చెప్పడం జరిగింది.  1.స్నేహిక-మృదుత్వం, దోష హారం కొరకు  2.శమన -కఫ వాత లక్షణాలను బట్టి  3.శోధన -శుభ్రంగా ఉండటానికి  4.రోపణ-నోటిలోని పుండ్లు తగ్గడం కొరకు etc  కరోనా వైరస్ నుండి కాపాడుకోవడానికి, రాకుండా ఉండటానికి మనకి రెండు రకాలు ఉపయోగపడతాయి అవి :  శోధన:బయటకి వెళ్లొచ్చిన తర్వాత, ఉదయం, ఎవరైతే కరోనా వ్యాధిగ్రస్థులో, అటువంటి వాళ్ళు శోధన కవళం చేయాలి.ఉప్పు నీళ్లు, గోరువెచ్చని నీళ్లు, ఆమ్లకి, యష్టిమధు, త్రిఫల వంటి కాషాయలతో నోటిని శుభ్రం చేసుకోవాలి. స్నేహిక:నోటిని శుబ్రపరిచాక oil pulling  చేయాలి.గోరు వెచ్చని నువ్వుల నూనె, కొబ్బరి నూనె వంటివి వాడవచ్చు.దీని...

త్రికటు:

త్రికటు: అనగా శుంఠి, పిప్పలి, మిరియాలు మూడింటిని కలిపి ఆయుర్వేదంలో త్రికటు అని, త్రియూషము అని అంటాము.  ఇది శరీరంలో ఏర్పడ్డ కఫం,కొలెస్ట్రాల్  అంటే అధిక బరువు, శ్వాస, కాస, చర్మరోగాలు, గొంతులోని సమస్యలు, వాపులు, ఉదరరోగ వంటి సమస్యలు నివారించడానికి  వైద్యులు వాడుతుంటాము.   ఇందులో శుంఠి-అల్లం పొడి, పిప్పళ్లు, మిరియాలు సమపాళ్లలో పొడిగా చేస్తారు.ఇవి మూడు కూడా కటు రసం అంటే కారం వంటి రుచి ని కలిగి వుంటాయని దీనికి ఈ పేరు.  మూడు కూడా ఉష్ణ వీర్యం ని కలిగి ఉంటాయి అంటే మనం ఈ ఔషధం తింటే శరీరంలో వేడిని పుట్టిస్తుంది.  ఈ లక్షణం వల్లనే ఉబ్బసం, ఆస్తమా, దగ్గు, దమ్ము,ఊపిరితిత్తుల సమస్యలు,  లావు,గర్భాశయ సమస్యలు, థైరాయిడ్, మధుమేహం, PCOD, ఆమవాతం (రుమటాయిడ్ ఆర్తరైటిస్ )వంటి కఫం-వాత  సంబంధ సమస్యల్లో బాగా ఉపశమనం ఇస్తుంది.  అలాగే ఇందులోని  శుంఠి జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు అంటే అరుచి, అజీర్ణం, IBS లో సరిఅయిన అనుపానం, మోతాదుతో వాడితే ఉపశమనం ఇస్తుంది. అలాగే ముఖ్యంగా రోగనిరోధక శక్తి పెంచడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది.ఇప్పుడు ఉన్న  కరోనా వైరస్ నుండి తట్టుక...