ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

AshGaurd -బూడిద గుమ్మడి

  #బూడిద గుమ్మడి-Ash Gaurd ఓం #ధన్వంతరే నమః బూడిదగుమ్మడిని చాలా రకాలుగా వాడతాము. విరివిగా లభించే ఈ గుమ్మడిలో ఎన్నో ఓషధ గుణాలు ఉన్నాయి. బూడిద గుమ్మడి ని, రసం,కల్కమ్, వంటల్లో, తీపిగా పేఠ  మాదిరిగా వాడుతుంటాము. బూడిదగుమ్మడి పైన పరిశోధనల వలన ఇంకా మరిన్ని సుగుణాలు వెలుగులోకి వస్తున్నాయి. నీటి శాతం అధికంగా ఉండి, విటమిన్ C, జింక్, మేగ్నేషియం, ఐరన్ వంటి మినరల్స్ కొంత వరకు ఉండి మూత్రవ్యవస్థకి మేలును చేస్తుంది. అదేవిధంగా ఫైబర్ కలిగి ఉండటం వల్ల జీర్ణవ్యవస్థకు మేలుచేస్తుంది. * ఆయుర్వేదంలో కుశ్మండకి, బృహత్ఫలి అంటాము, అనేక ఔషధతయారీలో, అవలెహంగానూ వాడుతాము. *శరీరంలో వేడి, కాక ఎక్కువగా ఉన్నవారికి, మూత్రములో సమస్య ఉన్నవారిలో చాలా ఫలితాన్నిస్తుంది. * బూడిదగుమ్మడి రసం(జ్యూస్)తాగడం వలన జ్వరం, రక్తహీనత, మూత్రంలో మంట, కడుపులో వేడి సమస్యను  తగ్గుతుంది. * లేతగా ఉన్న గుమ్మడి రసం(జ్యూస్) వలన పైత్యం, మూత్రములో రాళ్లు, క్రిమిరోగం, అతిమూత్రం వంటి సమస్యలు తగ్గుతాయి. * బరువు తగ్గాలనుకునే వాళ్ళు బూడిదగుమ్మడి ని తీసుకోవడం వలన పొట్ట నిండుగా ఉండి, ఎక్కువ తినాలనే కోరిక లేకుండా ఫలితం చూపిస్తుంది. * శరీరంలో in...
ఇటీవలి పోస్ట్‌లు

#వాము - Carum seeds

 వాము -Ajwain, carum seeds:  వంటింట్లో తప్పనిసరిగా ఉండే ఈ సుగంధద్రవ్యం చక్కటి ఔషధం. చిన్నపిల్లల మొదలు వృధ్దాప్యం వరకు అందరికి మేలు చేసే వాము గురించి మరిన్ని వివరాలు..  కారం, వగరు రుచి, ఉష్ణవీర్యం కలిగి ఉంటుంది.  వాము చెట్టు యొక్క ఫలాలు "వాముగింజలు". చూర్ణంగా, కషాయంగా, నేరుగా వాడటం జరుగుతుంది.  వాము లో ఉండే రసాయనాలు, ఆయిల్స్, విటమిన్స్, మినరల్స్, యాంటియోక్సిడెంట్స్ గాను, శరీరసమస్యలకు మందులా పనిచేస్తాయి.  * జీర్ణక్రియ:జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యల్లో కడుపుబ్బరం, అధికవాయువు, అజీర్ణం, ఆకలి లేకపోవడం, పొట్ట బరువుగా అనిపించడం వంటి సమస్యల్లో త్వరగా ఉపశమనం ఇస్తుంది.  * శరీర బరువు తగ్గించడంలో, అధిక కొలెస్ట్రాల్ తగ్గించడంలో చక్కగా ఉపయోగపడుతుంది.  *blood ప్రెషర్ ఎక్కువగా ఉన్నవారిలో లెవెల్  సాధారణస్థాయికి తేవడంతో పాటు, గుండెకి సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి.  * అంతేకాకుండా AntiInflammatory లక్షణం వలన పొట్టలోని సమస్యలు, మూత్రమార్గ ఇన్ఫెక్షన్ లు, ఉబ్బసం వంటి సమస్యల్లో బాగా ఉపశమనం ఇస్తుంది. * అలాగే వీర్యవృద్ధి, ఋతుక్రమం సరిచేస్తుంది. > వాము వేడ...

Aloevera- కలబంద

 #కలబంద -Aloe vera Aloe vera, కుమారి అని పేర్లు.జీవనవిధానంలో  చాలా పరిచయం ఉన్న మొక్క. ఇందులోని ఔషధ గుణాలు మానవాళికి ఎంతో మేలు చేస్తాయి.  ఆకులు, పువ్వులు ముఖ్యమైన ఔషధ గుణాలను కలిగిఉంటాయి. మధుమేహం, కీళ్ల నొప్పులు, ఉదర వ్యాధులు అంటే కాలేయం, ప్లీహ రోగాలు, స్త్రీలలో ఉండే గర్భాశయ సమస్యలు, చర్మ రోగుల్లో ఆయుర్వేదవైద్య నిపుణులు విరివిగా వాడుతుంటారు. ** కలబంద ఆకుల లోపలి జెల్లీవంటి గుజ్జును మంచి నీటితోశుభ్రంచేసి పటిక పంచదారతో కలిపి తింటే శరీరంలో వేడిచేయడాన్ని తగ్గిస్తుంది. ** కలబంద గుజ్జును పాత బెల్లంతో తినడం వలన కొన్ని రకాల గర్భాశయ సమస్యల్లో ఫలితం ఉంటుంది. ** గుజ్జులో పసుపు కలిపి తినడం వలన కాలేయ రోగం లో సహాయపడుతుంది. ** చర్మంకి వేడి  మంట తగిలిన వెంటనే, గాయంపై కలబంద పెట్టడం వల్ల నొప్పి తగ్గుతుంది అలాగే చర్మ నష్టం ఎక్కువగా జరగదు. ** ప్రతిరోజు కొద్ది కొద్దిగా తినడం వలన శరీరంలో పైత్యం పెరగకుండా చూస్తుంది.  అలాగే  ఇందులో ఉండే విటమిన్స్ A, C, E, విటమిన్  B12, మినరల్స్,ఆంటియాక్సిడెంట్ గా పనిచేస్తాయి. అలాగే రక్తవృద్ధిలో తోడ్పడుతుంది. ** ఇలాంటి చాలా మంచి ఉపయోగాలు ఉన్న కల...

#Fresh Butter - వెన్న

 #వెన్న - Fresh Butter వెన్న - fresh butter వెన్న అనగానే చిన్ని కృష్ణుడు గుర్తుకువస్తారు కదా... శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్బంగా వెన్న గురించి కొన్ని ఉపయోగపడే విషయాలు.....  ** అప్పుడే తీసిన వెన్న తియ్యగా, కొంచం పులుపు గా ఉంటుంది. ఇది శరీరానికి కాంతి, బలము మరియు వీర్యవృద్ధి కలిగిస్తుంది. కళ్ళకు చలువనిస్తుంది. ** పాత వెన్న ఉప్పు, వగరు, పులుపు రుచులు, గురుగుణం కలిగి ఉంటుంది.కళ్ళకు,శిరస్సుకి బలాన్నిస్తుంది. * వెన్న పంచదారతో కలిపి తినడం వల్ల గుండెకు, శరీరానికి బలం, వీర్యవృద్ధి ఇస్తుంది. * వర్షాకాలంలో వెన్నను పంచకోలా చూర్ణం తో, వేసవిలో చక్కర తో తీసుకోవాలి. * వెన్న వలన రక్తపితం, క్షయ, దగ్గు, వ్రణాలు, గాయాలు,గజ్జి,  వాత సమస్యలు తగ్గుతాయి. ×× వెన్నని కఫరోగం ఉన్నవాళ్లు, మూర్ఛ, వాంతి, జ్వరం,రక్తహీనత, మొదలగు కఫజనిత వ్యాధులు వున్నవాళ్లు మితంగా తీసుకోవడం మంచిది. అతిగా వెన్న తీసుకోవడంవల్ల అగ్నిమాంధ్యం, కఫం పెరగవొచ్చు అలాంటప్పుడు అల్లం, పంచదార, ఉప్పు  వంటివి కలిపి తీసుకోవాలి. #వెన్న పాలనుండి వచ్చిన పదార్థం, గురుత్వం అంటే heavy గా ఉంటుంది.ఎవరికైతే ఆకలి (జఠరాగ్ని) సరిగా ఉండి, జీర్ణక్రి...

#Manda - గంజి

#Manda - గంజి - kaanji #MANDA -#గంజి: Manda-బియ్యపు గంజి: పథ్యం అని ఆయుర్వేద వైద్యులు రోగికి ఉన్న జీర్ణశక్తి ని బట్టి,వారికి ఉన్న రోగంని బట్టి ప్రత్యేకంగా వివరించడం జరుగుతుంది.  ఆయుర్వేదంలో పథ్య - అపథ్యలు ముఖ్యపాత్రను పోషిస్తాయి. #స్వస్థవృత్తంలో, #దినచర్య మరియు #ఋతుచర్యల్లో వీటిని గురించి వివరాలు ఉన్నాయి.  శరీర శ్రోతస్సులకి హాని లేకుండా, శరీరానికి మేలుచేసే  ఆహారాన్ని "#పథ్యం" అంటాము. ఇది ఆరోగ్యవంతులకి, రోగగ్రస్తులకి పాటించాల్సిన క్రియ.  ఇందులో మండా, పేయ, విలేపి, యావగు అనే రకాలుగా వివరణ ఉంటుంది.  ఇక్కడి మన విషయం గంజి గురించి.... * మండా అంటే వాడుక భాషలో గంజి. బియ్యం ఒకటికి 14 వంతులు నీళ్లు కలిపి అన్నం మెత్తగా ఉడికే వరకు ఉంచి, ఆ  తర్వాత పైన ఉన్న నీటిని మనం మండా లేదా గంజి అంటాము.  * సులువుగా, అందరికి అందుబాటులో, తక్కువ ఖర్చుతో వుండే ఈ గంజి ఔషధంలా పనిచేస్తుందని చాలామందికి తెలియదు. * ఇది లఘు, శీతవీర్యం ఉంటుంది.అగ్ని దీపనం, పాచనం, వాతాన్ని తగ్గించే గుణం, గ్రాహి వంటి గుణాలవల్ల జీర్ణవ్యవస్థను ఆరోగ్యాంగా ఉంచుతుంది. దప్పిక, ఆకలిని తగ్గించడంలో తోడ్పడుతుంది.దేహపుష్...

Lemon-నిమ్మకాయ

నిమ్మకాయ-Lemon ఓం ధన్వంతరే నమః  నిమ్మకాయ : పుల్లని రుచి ని కలిగి ఉండి మన రోజువారి వంటల్లోను,  చిన్న చిన్న సమస్యలకి ఇంటి చిట్కాల్లోను  ఎంతో ఉపయోగపడే నిమ్మకాయ గురించి మరి కొన్ని విషయాలు...  ఆయుర్వేదంలో కొన్ని రకాల ఔషధ తయారీలో,  అలాగే రోగం ని దృష్టి పెట్టుకుని అనుపానంగా కూడా వాడతాము.  ఆమ్ల రసం, లఘు తీక్ష్ణ, ఉష్ణ వీర్యం నిమ్మ యొక్క గుణాలు.ఇది ఎక్కువగా వాత కఫ దోష హారంగా ఉండి, కొద్దివరకు పిత్తం ని పెంచుతుంది. ఆయుర్వేదంలో నిమ్మకాయని కంటి, చర్మ సమస్యల్లో, ఎక్కిళ్ళు, దప్పిక, వాంతి, శ్వాస,  కఫం, మలబద్దకం, కంఠం పై  భాగ రోగాల్లో, జ్వరం, పొట్టకు సంబంధించిన సమస్యల్లో యుక్తి తో వాడతారు. నిమ్మకాయ లో Vit C, citric acid తో పాటు Vit A, hesparidin, mallic acid వంటి రసాయనాలు మనకు ఆరోగ్యాన్ని అందించడంలో లాభ పడుతాయి.  * మూత్రపిండాల్లో రాళ్లకు నిమ్మకాయ రసం మంచి ఔషధం. ఇందులో ఉండే citric acid మూత్రం ని సాఫీ గా వెళ్ళడానికి, అలాగే మూత్రం ph సరిచేయడానికి తోడవుతుంది.  * రక్తం ఆల్కలీన్ (ఆమ్ల నుండి క్షారo)గా మార్చడానికి ఎంతో సహాయపడుతుంది.  *రక్తహీనతలో నిమ్మ, నారిం...

Yastimadhu-అతిమధురం

   Yastimadhu-అతిమధురం  ఓమ్ ధన్వంతరే నమః యష్టిమధు - అతిమధురం  Glycyrrhiza glarba, లికోరైస్, ములేఠి, అతిమధురం అని పేరు  ఉన్న ఈ ఔషధమొక్క వేరు చూర్ణం, కషాయం తియ్యగా ఉంటుందని ఈ నామం.  యష్టిమధు వేరు చూర్ణం చాలా రకాల ఆయుర్వేద ఔషదమందుల్లో వాడుతారు.  మధుర రసం, స్నిగ్ధ గురు గుణం, శీత వీర్యం కలిగి ఉన్న ఈ మొక్క వేరుచూర్ణం మేహశాంతి అంటే మూత్రం ఇబ్బంది లేకుండా ఉండటంలో, పిత్త వాత సమస్యల్లో, చర్మ సమస్యల్లో చాలా లాభకారిగా ఉంటుంది.  అంతేకాకుండా కడుపులోని అల్సర్ కి చాలా వరకు తగ్గిస్తుంది.కడుపులో మంట, తలతిప్పడం, శరీరంలో వేడి, వాంతి లక్షణాలు తగ్గిస్తుంది. * యష్టిమధు లో  ఉండే Anti inflammatory గుణం వల్ల ఊపిరితిత్తుల సమస్యలు -పొడి దగ్గు, ఉబ్బసం, శ్వాసనాల inflamation,   అలాగే పేగుల్లో,మూత్రనాళాల్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ ను తగ్గించడంలో సహాయపడుతుంది.   * ఇందులో ఉండే  antioxidants  రోగనిరోధక శక్తి పెరగడంలో సహాయపడుతుంది. * ఇందులో వుండే   స్పాస్మోలైటిక్ గుణం వల్ల విరేచనాకారిగా ఉండి, పేగుల్లోని మ్యూకస్ పొరకి మేలు చేస్తుంది. * యష్టిమధులో ఉం...